Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు అండగా నిలిచిన నా ఫేవరెట్ కెప్టెన్ అతనే!: సెహ్వాగ్

‘అనిల్ కుంబ్లే మాదిరిగా నాకు ఏ కెప్టెనూ అండగా నిలవలేదు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలి కన్నా కుంబ్లేనే నాకు ఎక్కువ మద్దతు ఇచ్చాడు. అనిల్ కుంబ్లే నా ఫేవరెట్ కెప్టెన్’ అంటూ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. సెహ్వాగ్ మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. బ్యాటింగ్ లైనప్లో మిడిలార్డర్లో ఆడాలని భావించిన సమయంలో తనను జట్టు నుంచి తప్పించారని చెప్పాడు. మిడిలార్డర్ బ్యాట్స్మన్గా కెరీర్ను ముగించాలని కోరుకున్నానని తన మనసులో మాటను చెప్పాడు. అయితే భారత్ క్రికెట్కు దశాబ్దంపైగా సేవ చేసిన తనకు ఫేర్వెల్ మ్యాచ్ లేకపోవడం వెలితిగా ఉందంటూ సెలెక్టర్లను విమర్శించి తన అసంతృప్తిని బయటపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్కు సెహ్వాగ్ ఇటీవల గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

More Telugu News